మన్యం న్యూస్ గుండాల:బృహత్ పల్లె ప్రకృతి వనం సేకరణ త్వరగా చేపట్టాలని పిడి మధుసూదన్ రాజు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన సాయనపల్లి, దామరతోగు గ్రామపంచాయతీలను సందర్శించారు. స్థల సేకరణ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని పంచాయతీ అధికారులను ఆయన ప్రశ్నించారు. తల సేకరణ త్వరగా చేపట్టాలని అన్నారు జూన్ నెలలో మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. రైన్ ట్రీ, గుళ మోహర్,పెళ్తోఫర్, రకాల మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ నాగ దివ్య, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు .