మన్యంన్యూస్ ఇల్లందురూరల్: విశాఖపట్నం లో మే21 న జరగబోయే గిరిజన సదస్సు లో పాల్గొనడానికి కొమరారం గ్రామం నుంచి గిరిజన ముఖ్య నాయకులు అల్లూరి కి ఘనంగా నివాళి అర్పించి విశాఖపట్నం బయలుదేరారు.ఈ సందర్బంగా గిరిజన నాయకుడు మోతిలాల్ మాట్లాడుతూ అల్లూరి ఇచ్చిన స్ఫూర్తి తో గిరిజన హక్కుల కోసం పోరాడుతామని, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాల రాస్తూ అడవి సంపదను బడా కార్పొరేట్ దోపిడీ దారులైన అంబానీ, ఆధానిలకి కట్టాబేడుతూ, గిరిజన ప్రజలని అడవి నుండి పంపివేస్తున్నారని అన్నారు. విశాఖపట్నం లో గిరిజన సమస్య లపైన అధ్యయనం, సమస్య లపైన పోరాటం, భవిష్యత్తు పోరాట కర్తవ్యం గురించి మేధోమధనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో గిరిజన నాయకులు కుంజా నరసయ్య,చింత ఉదయ్, సర్పంచ్ బానోత్ సంతు పోచారం సర్పంచ్ శ్రీను, కౌసల్య, కమిలి తదితరులు పాల్గొన్నారు.