మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 20
మణుగూరు మండలం లోని తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏలు జీవితాంతం రుణపడి ఉంటామని సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వీఆర్ఏలు పాల్గొన్న బట్ట సాలయ్య,గంటా వెంకటేశ్వర్లు, గంధం రామచందర్,కోరం. రాణి,ఈసం.భాగ్యలక్ష్మి,తాటి స్వప్న,బొడ్డు ప్రశాంత్,బట్ట అనిల్ కుమార్ తదతరులు పాల్గోన్నారు.