UPDATES  

 భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
పరిస్థితి విషమం.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చుంచుపల్లి పోలీసులు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పట్టించి హత్య రత్నానికి భర్త పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. చుంచుపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి
గార్ల మండలం సోమవారం గ్రామానికి చెందిన భూక్య శ్రీధర్ కొత్తగూడెం విద్యానగర్ కాలనీకి చెందిన భూక్య స్నేహలకు ఇటీవల వివాహమైంది. వివాహం జరిగి మూడు నెలలు గడవక ముందే వారి వద్ద వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు జరగటమే కాకుండా భర్త శ్రీధర్ వివాహిక జీవితానికి పనికిరాడని తేలడంతో వారిద్దరి మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారాయి. శ్రీధర్ వ్యవహార శైలిపై ఇటీవల కాలంలో కుల పెద్దలు పంచాయతీ పెట్టి వారిద్దరిని సముదాయించారు. అయితే వివాహిక జీవితానికి పనికిరాని శ్రీధర్ ఎందుకు తన బిడ్డ స్నేహను వివాహం చేసుకున్నాడని స్నేహ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆగ్రహించారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం పై న్యాయం చేయాలని కుల పెద్దల సమక్షంలో వారించారు. ఇటీవల కాలంలో స్నేహ, శ్రీధర్ విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ఎలాగైనా స్నేహను తన నుంచి దూరం చేయాలని భావించుకున్న స్నేహ భర్త శ్రీధర్ శనివారం విద్యానగర్ కాలనీలోని స్నేహ నివాసానికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా స్నేహను వ్యాపించడంతో ఆమె భరించలేక పెద్దపెద్ద కేకలు వేస్తూ ఇంటి బయటకు వచ్చి సమీపంలో ఉన్న బురద గుంటలో పడింది. ప్రాణాపాయ స్థితిలో స్నేహ పెద్దపెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి హుటాహుటిన చుంచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా 108 వాహనానికి ఫోన్ చేసి రప్పించారు. కాలిన గాయాలతో స్నేహ కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమెను వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీధర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై చుంచుపల్లి ఎస్సై సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !