- పి వి కాలనీ రోడ్డు సమస్యపై స్పందించిన ప్రజాప్రతినిధులు
- స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.9 కోట్లతో డబల్ రోడ్డు నిర్మాణం.
- త్వరలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ,విప్ రేగా చేతుల మీదుగా శంకుస్థాపన
- -ఎంపిటిసి గుడిపూడి. కోటేశ్వరరావు,సర్పంచ్ ఏనిక. ప్రసాద్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: 19
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయతి పరిధిలోని పీవీ కాలనీ కూనవరం నుండి ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కాలేజీ ల వరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 8 కోట్లు,సియస్ ఆర్ నిధులు నుండి 1 కోటి రూపాయలు మొత్తం రూ. 9 కోట్లు రూపాయలు తో డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నిధులు మంజూరు చేశారని స్థానిక ఎంపిటిసి గుడిపూడి. కోటేశ్వరరావు,సర్పంచ్ ఏనిక ప్రసాద్ తెలియజేశారు.ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగింది అని,టెండర్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో,వారం రోజుల లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని మే నెలలోనే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని వారు తెలిపారు.సింగరేణి కార్మికులు, కూనవరం ప్రజలకు ఎటువంటి సందేహం అవసరం లేదని, ధర్నాలు చేయవలసిన అవసరం లేదన్నారు.అన్ని పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వర్షాకాలంలో రైల్వే బ్రిడ్జి వద్ద అధిక వర్షాలు, తుఫాన్ ల వలన వరదలు వచ్చి,కార్మికులు,అధికారులు, ప్రజలు రాక పోకలకు ఇబ్బంది కలుగుతుంది అని గ్రహించి, జడ్పిటిసి పోశం. నరసింహారావు,టిబిజికెయస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు,అధ్వర్యంలో విప్, రేగా. కాంతారావు కు,ఆనాటి సింగరేణి జిఎం.జక్కం రమేష్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అని, నేడు రైల్వే బ్రిడ్జి దగ్గర సర్వీస్ రోడ్డు బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.ప్రజల అభివృద్ధి, సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వంక.అర్జున్ రావు, జెట్ పట్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.