మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ప్రభుత్వ సహకారంతో ఇల్లందులోని ముస్లిం మైనార్టీ సోదరులకు షాదిఖానా కొరకు 30 కుంటల ప్రభుత్వస్థలాన్ని కేటాయించి అందుకు సంబంధించిన పత్రాలను స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మైనార్టీ పెద్దలకు శనివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత ఎన్నికల సమయంలో మైనార్టీ సోదరులు శాదీఖానా కొరకు స్థలాన్ని కేటాయించాలని కోరడంతో ఆ సమయంలో తాను ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు అందుకు సంబంధించిన స్థల పత్రాలను వారికి అందించడం సంతోషంగా ఉందన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, ముస్లిం మత పెద్దలు, 3వ వార్డు కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్ కొకు నాగేశ్వరావు, 4వవార్డ్ కౌన్సిలర్ సయ్యద్ ఆజాం, 11వ వార్డ్ కౌన్సిలర్ శీను, 12వ వార్డ్ కౌన్సిలర్ సిలివేరి అనిత, 13వ వార్డ్ కౌన్సిలర్ కడగంచి పద్మ, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, పర్రె శీను, ఎస్కే పాషా, నయీమ్ పాషా, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, రాకేష్ ఇల్లందు పట్టణ అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి కంభంపాటి రేణుక, కోఆప్షన్ సభ్యులు ఘాజి, ఇల్లందు యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, నెమలి నిఖిల్, ఇల్లందు పట్టణ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
