మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు మున్సిపాలిటి పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన జీవన్ పాసిపై ప్రమాదవశాత్తు బొగ్గుపెళ్లలు పడి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుండడంతో భద్రాద్రిజిల్లా ఆదివాసీ జెఏసి చైర్మన్ పెండెకట్ల యాకయ్య దొర, శివశక్తి దండు సారికలు (సారయ్య) వారి స్వగృహానికి వెళ్లి జీవన్ పాసిని పరామర్శించి మూడువేల రూపాయల ఆర్ధికసాయంతో పాటు క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సింగరేణి సంస్థకు చెందిన బొగ్గును లారీలలో తరలించే క్రమంలో రోడ్డు వెంట ఉన్న జీవన్ పై బొగ్గుపెళ్లలు పడడం జరిగిందని, ఆ ఘటనలో జీవన్ కు తలపై 56 కుట్లు పడడం బాధాకరమని తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతనిపై ప్రమాదవశాత్తు బొగ్గుపెళ్ళలు పడి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని, ఇలా జరగడం దురదృష్టకమని పేర్కొన్నారు. పేదప్రజలకు తాము ఎల్లప్పుడు ఆపదలో ఉన్న ఎవరికైనా తమవంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో బీసీసంక్షేమ సంఘం జిల్లా నాయకులు అవునూరి గణేష్, మేకల నాగేశ్వరరావు, నతారి రంజిత్, సోను తదితరులు పాల్గొన్నారు.