- స్వచ్ఛత వైపు మరో ముందడుగు
- నిరుపయోగమైన వస్తువులు ఉపయోగంలోకి..
- మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు
*మన్యం న్యూస్,ఇల్లందు..స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. ఇదివరకే స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ఇల్లందు పట్టణంలో అనేక కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రంలోనే ఇల్లందు పురపాలక సంఘం విశిష్ట గుర్తింపును సాధించింది. అదే స్ఫూర్తితో మరోఅడుగు ముందుకేసి మన ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించి ఉపయోగపడే వారికి అందజేసేందుకు మేరా స్వచ్ఛ శెహర్ అనే సరికొత్త కార్యక్రమానికి ఇల్లందు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు త్రిబుల్ ఆర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే శనివారంనాడు ఇల్లందు మున్సిపాలిటీ పదో వార్డు నందు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి నిరుపయోగ వస్తువులను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మన ఇంట్లో నిరుపయోగం ఉన్న వస్తువులను సేకరించి వాటిని డంపింగ్ యార్డ్ నందు భద్రపరిచడం జరుగుతుందని, ఎవరికైనా అవసరమైతే అక్కడికి వెళ్లి ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమానికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.