మన్యం న్యూస్ చండ్రుగొండ, మే20: విద్యుత్ షాక్ తో రెండు పాడిగేదేలు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి రామారావు, రామిశెట్టి నాగేశ్వరరావులకు చెందిన రెండు పాడిగేడేలు ఈ నెల 19(శుక్రవారం) ఉదయం మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. శనివారం గ్రామ శివారులోని రైతుల పోలాల వద్ద విద్యుత్ స్థంభం విరిగిన వద్ద కరెంట్ షాక్ తో పాడి గేదెలు మృతి చెంది ఉన్న విషయాన్ని రైతులు గమనించారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ రెండు పాడి గేదెల విలువ రూ.1లక్ష వరకు ఉంటుందని బాధిత రైతులు వాపోయారు. రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.