మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 20: టియుసిపిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజుకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని అశ్వారావుపేట మండలం పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు అశ్వరావుపేట నియోజకవర్గం కన్వీనర్ యన్ జయరాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముక్తకంఠంతో కోరారు. మంగళవారం పట్టణ కేంద్రంలో కల్వరి ప్రార్థన మందిరం నందు క్రైస్తవ సమాఖ్య ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ యన్ జయరాజు మాట్లాడుతూ క్రైస్తవ సమాజ పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రైస్తవ సమాజ పక్షాన విస్తృతమైన సేవలందిస్తున్న తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజుకు క్రిస్టియన్ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆయన గత 20 సంవత్సరాలుగా క్రైస్తవ సంక్షేమం కోసం అనేక శాంతియుత పాదయాత్రలు చేసి సమాజ అభివృద్ధికి దోహదపడ్డారు. అంచెలంచలుగా ఎదిగి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ క్రైస్తవ పాస్టర్లకు వెన్నుదన్నుగా ఉంటున్న ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి మాకు సముచిత స్థానాన్ని కల్పించాలని వారు కోరారు. 33 జిల్లాల క్రైస్తవ సమాజాన్ని ఏకతాటిపై నడిపించి ఆ సమాజ అభివృద్ధి కోసం పని చేస్తున్న క్రైస్తవ నాయకుడు గోనె సాల్మన్ రాజు అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ లు జయరాజు, జవహర్ లాల్ నెహ్రూ, నడ్డి దేవదాసు, సీయోను కుమార్, వెంకటరత్నం, ప్రకాశరావు, సాదు రమేష్, సుజీవరావు తదితరులు పాల్గొన్నారు.