UPDATES  

 రెండో విడత అక్రిడియేషన్లు ఎప్పుడు ఇస్తరు సారూ..

  • రెండో విడత అక్రిడియేషన్లు ఎప్పుడు ఇస్తరు సారూ..
  • టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతిపత్రం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఎంతోకాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండో విడత అక్రిడియేషన్లు కాలం ముగుస్తున్నప్పటికీ చేతికి కార్డు కూడా రావడం లేదన రెండో విడత అక్రిడియేషన్ల విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మంజూరు చేయాలని కోరుతూ శనివారం టియూడబ్ల్యూజే (టీజేఎఫ్)143 యూనియన్ ఆధ్వర్యంలో పిల్ల పౌర సంబంధాల శాఖ అధికారి శీలం శ్రీనివాసరావు సమక్షంలో
జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ షఫీ.టెంజు జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, అక్రిడేషన్ కమిటీ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కు వినతి పత్రం ఈ సందర్భంగా యూనియన్ బాధ్యులు, అక్రిడియేషన్ కమిటీ సభ్యులు మాట్లాడారు.రెండో విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు, మార్పులు చేర్పులు ఇళ్ల స్థలాల పంపిణీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఎంతోకాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సత్వరమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబం ధించి చర్యలు తీసుకోవాలని , జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే( టీజేఎఫ్) 143 యూనియన్ ప్రత్యక్ష ఆందోళన కూడా సిద్ధమవుతామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా సత్వరమే అక్రిడియేషన్ల విషయంలో దృష్టి సారించి మంజూరు చేయాలని విన్నవించారు.అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.సోమవారం రోజున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని, అంతే కాకుండా సోమవారం రోజున యూనియన్ నాయకులు అక్రిడియేషన్ల సభ్యులు కూడా జిల్లా కలెక్టర్ ను కలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సాక్షి జిల్లా బ్యూరో కృష్ణ గోవింద్, ఐజేయు,అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు చండ్ర నరసింహా రావు,అక్రిడిడేషన్ కమిటీ సభ్యులు తోటమల్ల బాల యోగి, కాటా సత్యం, యూనియన్ నాయకులు రవికుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !