మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ ఎం కరుణాకర్ ను శనివారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెంలో అల్లరి మూకలు ఎక్కువయ్యారని విచ్చలవిడిగా కొత్తగూడెం యువత గంజాయి కి బానిస అయ్యారని అలాగే ఎస్సీ ఎస్టీల పై జరుగుతున్న అగ్రకుల దాడులను అరికట్టాలని. కోరారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏరియాలో యువతతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇప్పిస్త నని సిఐ కరుణా కర్ అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు సబ్బారపు( చిన్ని) మధుసూదన్, మాల మహానాడు రాష్ట్ర సహాయ కార్యదర్శి కూరపాటి రవీందర్, ప్రజాకవి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ రాష్ట్ర బాధ్యులు మేదర వెంకట ముత్యం, రాజశేఖర్ నర్వే, మాల మహానాడు మహిళ జిల్లా అధ్యక్షులు నక్క సృజన, మాల మహానాడు జిల్లా కార్యదర్శి లు జెల్లా రాజేష్, సబ్బారపు నాగేందర్ (బుస్సి), భూపతి అశోక్, మాల మహానాడు పట్టణ నాయకులు గంధం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు