UPDATES  

 గొంతెండుతుంది గుక్కెడు నీళ్లు ఇవ్వండి సారూ… హాస్టల్ విద్యార్థులు వేడుకోలు

  • గొంతెండుతుంది గుక్కెడు నీళ్లు ఇవ్వండి సారూ…
  • హాస్టల్ విద్యార్థులు వేడుకోలు
  • గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో.. మూలుగుతున్న ఆర్వో వాటర్ ప్లాంట్
  • మరమ్మత్తులు ఎప్పుడు చెయిస్తారో ఏమో

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒకవైపు పెద్దపీట వేసి కావలసినన్ని నిధులు సమకూర్చి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇస్తున్న ఆదేశాలు కొందరి అధికారులు నిర్లక్ష్యంగా నిరుపయోగంగా మారుతున్నాయి. అదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో లక్షలాది రూపాయలను వెచ్చించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. ఎంతోకాలంగా ఆ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆ వసతి గృహంలో చదివే గిరిజన విద్యార్థులు దాహార్తితో అలమటిస్తున్నారు. గత ఏడాది నుంచి వసతి గృహంలో మూలనపడ్డ ఆర్వో వాటర్ ప్లాంట్ ను తిరిగి మరమ్మత్తులు చేపట్టి పునర్దించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అర్థం కావడం లేదు కానీ గత ఏడాది నుంచి విద్యార్థులు బోరు నీరుకే పరిమితమయ్యారు. జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో సుమారు 50 నుంచి 60వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి కోటి రూపాయలు వెచ్చించి ఖర్చు చేసిన గిరిజన అభివృద్ధి సంస్థ ఆర్వో వాటర్ ప్లాంట్లపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావలసినన్ని నిధులు సమకూరుస్తున్నప్పటికీ అధికారులు అలసత్వంతో ఆ నిధులు కాస్త నిరుపయోగంగా మారుతున్నాయని విమర్శ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వసతి గృహంలో ఏడాది పొడవున మరమ్మత్తులకు నోచుకుని విద్యార్థులకు తాగునీరుకు కష్టమైనప్పటికీ అధికారులు ఎందుకు దృష్టి సారించలేదు అనేది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సుమారు రెండు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంమే మరమ్మతులకు నోచుకుందని పలుమార్లు హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు వారి వారి వీళ్ళకు వెళ్లారు తిరిగి జూన్ 12న పాఠశాలలు పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో హాస్టల్కు వచ్చే విద్యార్థులకు తాగునీరు కష్టమైయే పరిస్థితి ముందుగానే కనబడుతుంది. అధికారులు ఇప్పటికైనా ముందస్తు దృష్టి సారించి పాల్వంచ గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో మూలన పడి ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !