*మన్యం న్యూస్,ఇల్లందు…:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో రూ.13 లక్షలతో అలాగే 12వ వార్డులో రూ.13 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ బస్తీ దవాఖానాలను ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా బస్తి దవాఖానాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఇది కేసీఆర్ రాజకీయ దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉచిత వైద్యం, సంప్రదింపులు, నిపుణుల సేవలు, రోగనిర్ధారణ పరీక్షలు, టెలిమెడిసిన్ సౌకర్యాలు కూడా అందిస్తూ బస్తీ దవాఖానాలు పేదలకు వరంగా మారాయని తెలిపారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి అంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, స్థానిక12వ వార్డు కౌన్సిలర్ సిలివేరి అనిత, 3వ వార్డు కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరావు, డిస్టిక్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ శిరీష్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కవిత, 11వ వార్డ్ కౌన్సిలర్ శీను, 13వ వార్డ్ కౌన్సిలర్ కడగంచి పద్మా, ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పెండ్యాల హరికృష్ణ, పివి కృష్ణారావు, పర్రె శీను, ఎస్కే పాషా, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారవు రాజేష్, ఇల్లందు పట్టణ అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు కొక్కు సరిత, ఇల్లందు పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.