మన్యం న్యూస్ వాజేడు.
ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక గోదావరి వంతెన సమీపంలోని 163 జాతీయ రహదారి పై రోడ్డు లో ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు డి, కొట్టిన ఘటన లో వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన తల్లడి రవి (37) మృతి చెందాడు.ఆదివారం తెల్లవారుజామున శుభకార్య నిమిత్తం చల్పక గ్రామం వెళ్లి బర్లగుడెం గ్రామం తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కాగా ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న అతనిని ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అత్యవసర నిమిత్తం చికిత్స జరుగుతుండగా మరణించినట్లు డాక్టర్ వెల్లడించారు. తల్లడి ప్రమీల ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు