మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిధి గృహ ఆవరణలో ఆదివారం మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ములుగు జిల్లా కమిటీ ఆద్వర్యంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(ఎంహెచ్ పిఎస్)వ్యవస్థాపక అద్యక్షులు అంబేడ్కర్ అవార్డు గ్రహిత మైస.ఉపేందర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకు కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు వేల్పుల రామ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ లకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైస.ఉపేందర్ తోనే సాద్యమన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చెన్నం.గోపి,రాష్ట్ర కార్యదర్శి వంకాయల.వెంకటేశ్వర్లు, వేల్పుల మనోజ్,వినోద్,వావిలాల.మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.