మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని ఇంద్రవెల్లి మండలం కేశ్లపూర్ నాగోబా దేవాలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు అభివృద్ధి జరుగుతుంది అన్నారు.తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఆదివాసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వమత సమ్మేళనానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్ని మతాలకు కులాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ ఫలాలను అందించి ప్రజలను ఆర్థిక స్వావలంబ దిశగా పయనింపజేశారని అన్నారు.ఈకార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక , సంక్షేమ సంఘ డివిజన్ అధ్యక్షులు పోలె బోయిన అనిల్ కుమార్, ఉపాధ్యాయులు పడిగా అంజయ్య, సర్పంచ్ రాము, తదితరులు పాల్గొన్నారు