UPDATES  

 స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి ఘనంగా నివాళులర్పించిన టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 21: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ గ్రామంలో ఇందిరా గాంధీ విగ్రహం వర్ధ ఘనంగా నివాళులు అర్పించి ప్రభుత్వ ఆసుపత్రి లో బ్రేడ్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా వగ్గెల పూజ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ భారతదేశాన్ని నవశకంలోకి నడిపించిన గొప్ప నాయకుడన్నారు. ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోని దేశం ఎంతో అభివృద్ధి చెందిందని కులాలకు మతాలకతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారు మహేష్, కందుల వెంకటేష్ రావు, ఊకె ముత్తయ్య, జెట్టి క్రాంతి, మంగరాజు, సున్నం రవి జెట్టి రాజేష్, జెట్టి వినయ్, తెల్లం బాలరాజు, కోలేటి నవీన్, కోలేటి దేవుడు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !