UPDATES  

 సమస్య మీది.. పరిష్కారం మాది ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ప్రజావాణిలో వచ్చిన సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించిజిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖలఅధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలోపరిశీలన
చేయాలని, తదుపరి పిర్యాదు దారునికి లిఖిత పూర్వకంగా సమాచారం అందచేయాలని అన్నారు. పెండింగ్ ఉంచకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు.ప్రజావాణిలో ప్రజలు అందచేసిన విజ్ఞాపనలు కొన్ని::-
పాతపాల్వంచ మండలం, రామానందతీర్థ కాలని వాసులు డ్రైనేజి నిర్మించాలని గతంలో ప్రజావాణిలో దరఖాస్తుచేశామని సమస్య పరిష్కారం కాలేదని, డ్రైనేజి సౌకర్యం లేకపోవుట వల్ల ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరు రోడ్డుపైకివస్తుందని, మురుగునీటితో దుర్వాసన వస్తున్నదని, ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, కావున మా
వీధికి డ్రైనేజి సౌకర్యం కల్పించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగుచర్యలు నిమిత్తం పాల్వంచ మున్సిపల్ కమిషనర్క ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలానికి చెందిన తాళ్లూరి తపస్వి తనకు సుజాతనగర్ మండలం, నిమ్మలగూడెం గ్రామ పరిధిలోవ్యవసాయ భూమి కలదని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద చేపల చెరువు ఏర్పాటుకు అనుమతిమంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నానని, అట్టి దరఖాస్తును పరిశీలించి చేపల పెంపకానికి చెరువు ఏర్పాటుకుఅనుమతి మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును మత్స్యశాఖ అధికారికి ఎండార్స్ చేశారు.దుమ్ముగూడెం మండలం, గ్రామానికి చెందిన లంకా లక్ష్మి మధుమేహం పెరగడం వల్ల ఎడమకాలు తొలగించారని,దాని వలన ఎటూ ఎళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, కావున తనకు వికలాంగుల పింఛను మంజూరు చేయాలని చేసిన
దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు కొరకు డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు.
మణుగూరు మండలం, అశోక్నగర్ గ్రామానికి చెందిన కొర్లపాటి రాజేష్ ఖన్నా పుట్టుకతోనే దివ్యాంగుడనని,
వెటర్నరీలో డైరీ కోర్సు పూర్తి చేసియున్నానని, తనకు దివ్యాంగుల కోటాలో మణుగూరు, అశ్వాపురం మండలాలవెటర్నరీ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు నిమిత్తం
పశు సంవర్ధక శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
అశ్వారావుపేట మండలం, డ్రైవర్స్ కాలనీ వాసులు తాత ముత్తాతల నుండి సర్వే నెం. 104లోని పోడుభూముల్లోవ్యవసాయం చేసుకుంటున్నామని, మొత్తం 22 మందిలో 18 మందికి భూమి సర్వే నిర్వహించారని, పాలిబోయిన
కోటమ్మ, మొగసాల సరోజని, గోళ్ల సుందరమ్మ, పోలిబోయిన రంగ అనే వ్యక్తులకు సర్వే చేయలేదని, పైన తెలిపినభూమి తప్ప ఎలాంటి జీవనాధారం లేదని, అటవీ అధికారులు తమ మీద దౌర్జన్యంగా కేసులు నమోదు చేసి భూములను
తీసుకుందామని బెదిరిస్తున్నారని, అట్టి భూములను సర్వే చేపించి హక్కు పత్రాలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తునుపరిశీలించిన ఆయన తగు చర్యలు నిమ్హం కలెక్టరేట్ ధరణి పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.చుంచుపల్లి మండలం, పెనగడప గ్రామానికి చెందిన మన్నె ఆదినారాయణ ఇంటిస్థలం ఉండి ఇళ్లు లేని పేదప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని, తాను ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తగు చర్యలు కొరకు డిఆర్జేకు
ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !