- తగిన నష్టపరిహారం ఇవ్వకుంటే రెండో సర్వేలో జానేడు భూమిని కూడా ఇచ్చేది లేదు
- అధికారులు రైతులతో ప్రజలతో కులంకుషంగా చర్చలు జరపాలి
- సంపూర్ణంగా కరకట్ట డిజైన్ ను ప్రజలకు గ్రామసభల ద్వారా తెలియజేయ్యాలి
- సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం
- సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసీత సంఘం…
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని దేవరపల్లి గ్రామంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసీత సంఘం ఆధ్వర్యంలో సీతమ్మ సాగర్ ప్రారజెక్ట్ నిర్మాణం కారణంగా నష్టపోతున్న రైతులను ప్రజలను ఆదుకోవాలని రైతులు ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసీత సంఘం అధ్యక్షులు, సత్యన్నారాయణపురం సొసైటీ డైరెక్టర్ సీతారామరాజు, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసీత సంఘం కార్యదర్శి రాజు లు మాట్లాడుతూ ప్రజలను భాగస్యామ్యం లేకుండా జరుగుతున్న రెండొవ దఫా భూసేకరణ విదానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నరాని మిగులు భూములకు ప్రభుత్వం ఉతితంగా మోటార్లు ఇచ్చి సాగున్నీరు సౌకర్యం కల్పించాలనీ
రెండోవిడత చేస్తున్న సర్వే భూమిలకు నష్టపరిహారంగా భూమికి భూమి ఇవ్వాలనీ లేదా ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలనీ నిలిచిపోయిన కరకట్ట పనులు తక్షణమే ప్రారంభంచాలనీ, రానున్న వరదల భారినుండి చర్ల మండలాల ప్రజలను కాపాడాలనీ కరకట్ట ప్రాజెక్ట్ డిజైన్ న్ని గ్రామసభల ద్వారా ప్రజాలకు తెలపాలనీ, బ్యాక్ వాటర్ కారణంగా మునిగిపోయే భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాకపోతే పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రైతులు కొమరం దామోదర్, నరసింహారావు, వీరాంద్ర కుమార్ భీమరాజు తదితర ప్రజలు పాల్గొన్నారు.