మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 22
మణుగూరు మండలం,అశోక్ నగర్ గ్రామానికి చెందిన చిట్యాల మల్లయ్య ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ వల్ల కాలును తీసేయడం జరిగింది.వారి కుటుంబ పరిస్థితి బాగాలేదని తెలుసుకొని సోమవారం మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,ఆంధ్రప్రభ జీఎం పసునూరి.భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే వారు స్పందించి వారి ట్రస్ట్ ద్వారా రూ.3000 రూపాయలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మార్తి.శ్రీనివాసరావు,రంగాశ్రీనివాసరావు,చిందుకూరి.ఏడుకొండలు,గాండ్ల సురేష్,దోసపాటి.కనకారావు,కర్ల. ఎంకన్న,యగ్గడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.