- క్రీడలకు క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపుని ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్
- కొత్తగూడెంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని క్రీడలు వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహద పడతాయని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు తెలిపారు. సోమవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని ప్రకాశం క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీయం కప్ 2023 క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రీడల్లో చురుకుగా పాల్గొనడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని తెలిపారు. క్రీడలు వల్ల శారీరకంగా దృడంగా మానసికంగా దృడత్వాన్ని సాదించి చదువులో ప్రతిభను కనబరచగలుగుతారని చెప్పారు. చిన్నతనంలో గ్రామీణ ప్రాంతాలలో క్రీడలకు ప్రాధాన్యత లభించక పోయేదని, అన్నింటికి మూలమైన ఆరోగ్యాన్ని సాధించాలంటే యువతకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు క్రీడలు దోహద పడతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాదాన్యత ఇస్తూ మట్టిలో మాణీక్యాలను వెలికితిసే క్రమంలో సీయం కప్ 2023 క్రీడలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగా గ్రామీణ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల్లో మన జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ఇంతటి ప్రాముఖ్యత, పేరున్న మన జిల్లాకు సీఎం కప్ క్రీడల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పారు. ఎన్నో దశలను దాటి జిల్లా స్థాయికి వచ్చారని, ఇదే స్పూర్తితో రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాలని చెప్పారు.
క్రీడల్లో జిల్లా కీర్తికిరిటాన్ని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. క్రీడల్లో ప్రావీణ్యులను గుర్తించి వారికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపును తీసుకువచ్చేలా గ్రామస్థాయి నుంచి మండలస్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నిర్వహించిన సీయం కప్ క్రీడా పోటీలను జిల్లాలోని అన్ని మండలాలతో పాటు మున్సిపాల్టీలల్లో నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో వాలీబాల్ పురుషుల విభాగంలో 23 టీములకు 230 మంది, కబడ్డీ మహిళలు 4 టీమ్స్ (40 మంది) పురుషుల కబడ్డీ 23 టీమ్స్ (230 మంది) ఫుట్ బాల్ 8 టీములు (88 మంది) బాడ్మింటన్ 50 మంది, స్విమ్మింగ్ లో 10 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా క్రీడల అధికారి సీతారాం తదితరులు పాల్గోన్నారు.