మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఇటీవల కాలంలో అనారోగ్య కారణాలతో మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తన కార్యాలయంలో చెక్కులను అందజేశారు.పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ గత సంవత్సరం గుండెపోటుతో మరణించిన ఏఎస్సై శ్యాంసన్ రావు గారి కుటుంబానికి రూ.4,00,000/-ల రూపాయల నగదును సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముత్తయ్య గారి కుటుంబానికి రూ. 8,00,000ల రూపాయల నగదును ఎస్పీ చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.భద్రతా విభాగం నుండి ఎక్స్గ్రేషియా గా ఈ నగదును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది విధులతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయజూనియర్అసిస్టెంట్మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.