మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 22
మణుగూరుకు చెందిన జాటోత్ కృష్ణ,జాటోత్ మంగమ్మ హాట్ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చారని తెలుసుకొన్న జడ్పిటిసి పోశం.నరసింహారావు సోమవారం వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కంపసాటి రాధమ్మను పరామర్శించారు.గుగులోతు అనురాధ భర్త గుగులోత్ బాలాజీ చనిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రామిడి.రామిరెడ్డి,గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు కంభంపాటి.శీను,బుద్ధుల ప్రసాద్,కనితి ప్రవీణ్ కుమార్, కట్ట రాజ్ కుమార్,శరత్ సుతారి వెంకన్న,నాంపల్లి కార్తీక్,మహిళ నాయకులు సహనాజ్,సుజాత.గౌస్య,తదితరులు పాల్గొన్నారు.