మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం తహసీల్దార్ కార్యాలయం నందుసోమవారం ములుగు శాసనసభ్యులు సీతక్క చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణి చేశారు.సోమవారం నాడు పంపిణి చేసిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు ఎస్టీ 31, ఎస్సి 13, బీసీ, ఈ బీసీ 83, మైనారిటీ (బీసీ ఈ )08, మొత్తం 135 చెక్కులు(13,515,660 రూపాయలు) పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో, మంగపేట మండలం సొసైటీ చైర్మన్ తోట రమేష్, మండల తహసీల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
