మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలు అయినా గంటల కుంట,చింతల మోరి, చింతలపాడు,కొమరం భీమ్ నగర్,రాయబంధం,ఎలిసెట్టి పల్లి గ్రామాలలోని గిరిజనులు ఈ వేసవికాలంలో త్రాగునీరు లేక అల్లాడుతున్నారని వెంటనే
ఐ టి డి ఏ అధికారులు ఆయా గ్రామాలలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్ల నీళ్లను ఏర్పాటు చేసి త్రాగునీరు అందించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ములుగు జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు ఎట్టి ప్రకాష్ అన్నారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో ఐటిడిఏ మేనేజర్ శ్రీనివాస్ కు సంఘ నాయకులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎట్టి ప్రకాష్ మాట్లాడుతూ. గిరిజన గ్రామాలలో త్రాగు నీటి ఎద్దడి ఏర్పడడంతో ఆయా గిరిజన గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్న వాగుల్లోకి చెలిమల ద్వారా త్రాగునీటిని తీసుకువస్తున్నారు.శుభ్రమైన మంచినీరు లేక అనారోగ్యాలతో బాధపడుతూ రోగాల పాలవుతున్నారు అని అన్నారు కావున ఐటీడీఏ అధికారులు స్పందించి ఆయా గ్రామాలలో త్రాగునీటి వసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల కన్వీనర్ రాజేష్,గొప్ప నవీన్, రాజు,సురేష్,మహేష్,జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
