మన్యం న్యూస్,ఇల్లందు:ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ను వారి నివాసంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఇల్లందు పట్టణంలో త్వరలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మంత్రిని ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెంట ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్నారు.
