*మన్యం న్యూస్,ఇల్లందు…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఇంచార్జిలు, రాష్ట్ర నాయకులతో పాటు ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్రనాయకులు చాందావత్ రమేష్ బాబు, జానీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ… ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతి ఉన్నంతకాలం ఉంటుందని, తెలుగుప్రజల హృదయాల్లో మహానుభావుడిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని అన్నారు. భారతదేశంలోని సంక్షేమ పధకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, నేడు ఎన్టీఆర్ తెచ్చిన అనేక పధకాలను పేరు మార్చి ఇప్పటి ప్రభుత్వలు నడిపిస్తున్నాయి అని వంశీ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెదేపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణాలో మెజారిటీ సీట్లు గెలుస్తాం అని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇప్పటికే అటువైపుగా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.