- నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లు ఐదుగురు
- మిలిషియా సభ్యుల ఐదుగురుఅరెస్ట్
- భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం, ములకనపల్లి అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం
పోలీసులు, 141బి సిఆర్పిఎఫ్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో 10 మంది అనుమానితుల్ని పట్టుకుని విచారించగా అందులో05గురు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లు మిగిలిన 05గురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ మిలిషియా సభ్యులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
అరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లు అయినా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన జున్ను కోటి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కినేనిపల్లికి చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన బోలేరా వాహన డ్రైవర్ మేకల రాజు, వరంగల్ జిల్లా కోనాపురం గ్రామానికి చెందిన చిలువేరు రమేష్ వరంగల్ జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాళ్లపల్లి ఆరోగ్యం ఉన్నారు.అరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిషియా సభ్యుల వివరాలీలా.. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ముసికి రమేష్ మల్లంపేట గ్రామానికి చెందిన ముస్లిక్ సురేష్ ,కొత్తపల్లి గ్రామానికి చెందిన బాడిస లాలు సోడి మహేష్ మడివి చేతు ఉన్నారని అన్నారు అరెస్ట్ కాబడిన వారి వద్ద నుంచి నిషేధిత పేలుడు పదార్థాలైన కార్డెక్స్ 90 బండిల్సు, డిటో నేటర్లు 500 సర్లిస్టిక్స్ 600 బోలెరా వాహనం ఒకటి, ట్రాక్టర్ ఒకటి ద్విచక్ర వాహనాలు రెండు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.నిందితులు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఆగ్రనాయకుల అదేశానుసారం పోలీసు
క్యాంపుల పైన కూంబింగ్ కు వచ్చే పోలీసుల పైన దాడులు చేయడానికి అవసరమైయన
ల్యాండ్ మైన్ల,ఐఈడిలు రాకెట్ లంచర్ల తయారీకి ఉపయోగపడే ప్రేలుడు పదార్దాలను
పైన తెలిపిన మావోయిస్ట్ కొరియర్లు (05 మంది) బోలెరో వాహనంలో దుమ్ముగూడెం మండలం
ములకనపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకుని వచ్చి మావోయిస్ట్ పార్టీ మిలిషియా సభ్యులు (05
మంది) తీసుకు వచ్చిన ట్రాక్టర్లో లోడు చేస్తుండగా పోలీసు వారు పట్టుకున్నారని అన్నారు. ఇట్టి కేసులో
మావోయిస్ట్ పార్టీ కొరియర్లకు ప్రేలుడు పదార్ధాలు సరఫరా చేసిన వ్యక్తుల పై లైసెన్స్
సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇలాంటి ఖరీదైన పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి నిషేధిత సిపిఐ
మావోయిస్టు పార్టీ నాయకులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని
ఆదివాసీల వద్ద నుండి,కాంట్రాక్టర్లు, రైతులను బెదిరిస్తూ పోలీసు వారిని హతమార్చడానికి పథకం పన్నుతున్నారని అన్నారు.