UPDATES  

 కొయగుడెం ఓసి సింగరేణి సేక్కూరిటి గార్డుల ప్రాణాలతొ చెలగాటం ఆడుతున్న యాజమాన్యం.

  • కొయగుడెం ఓసి సింగరేణి సేక్కూరిటి గార్డుల ప్రాణాలతొ
  • చెలగాటం ఆడుతున్న యాజమాన్యం.
  • అరకొర వసతులతొ ప్రధాన చెక్ పొస్టు
  • కాంక్రీట్ బిల్డింగ్ నిర్మించాలి …కె సారయ్య

మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి బృందం వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య ఆధ్వర్యంలో సోమవారం నాడు కొయగుడెం ఓసి ప్రధాన చెక్ పొస్టును సందర్శించడం జరిగింది. ఈ మేరకు అక్కడ వున్న పరిస్థితులను విధులు నిర్వహిస్తున్న సెక్కూరిటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇల్లందు ఏరియాకు గుండె కాయలాంటి కేఓసి అధిక లాభాలను సింగరేణికి అందిస్తున్నప్పటికీ సెక్కూరిటి గార్డులు విధులు నిర్వహిస్తున్న ప్రధాన చెక్ పోస్టు అద్వాన్నంగా వుందని సరియైన వసతులు లేక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలకు చెక్ పొస్టు నందు నీళ్లు చేరడం జరుగుతుందని, చెక్ పొస్టుకు పర్మినెంట్ కాంక్రీట్ బిల్డింగ్ వుండాల్సింది పోయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐరన్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారని దీనికారణంగా వర్షం వస్తే షాట్ సర్క్యూట్ అయ్యో అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .వర్షం వచ్చినప్పుడు విధులు నిర్వహిస్తున్న సేక్కూరిటి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వర్షం వచ్చినప్పుడు చెక్ పోస్టులోని కంప్యూటర్లు కూడా కాలిపోయే ప్రమాదం ఉందని కాబట్టి యాజమాన్యం వేంటనె స్పందించి సెక్కూరిటి వారి సంక్షేమం కోసం ప్రస్తుతం ఉన్న ఐరన్ చెక్ పొస్టును తొలగించి దానిస్థానంలో పర్మినెంట్ కాంక్రీట్ బిల్డింగ్ నిర్మించాలని, ఏసి సౌకర్యం కల్పించాలని, కంప్యూటర్ చైర్స్ ను, టేబుల్లను ఏర్పాటు చేసి సెక్కూరిటి గార్డుల ప్రాణాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, కౌన్సిలర్ కుమ్మరి రవీందర్, ఎస్కే వళి తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !