మన్యం న్యూస్,ఇల్లందు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రాంరెడ్డి వెంకటరెడ్డి జయంతిని ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామేపల్లిలో గల రాంరెడ్డి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి వెంకటరెడ్డి అని, పలుమార్లు మంత్రిగానూ పనిచేసి తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన రాంరెడ్డి వెంకటరెడ్డి నేడు మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం రాంరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.రవితో పాటు ఇల్లందు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరవిందస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.