మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 22: అశ్వారావుపేట మండలంలో సోమవారం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొన్నారు. మండల పరిదిలోని గుమ్మడివాల్లి గ్రామంలో జెట్టి వెంకటేశ్వరరావు మేనల్లుడు వివాహం ఆదివారం జరగగా సోమవారం వారి నివాసానికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదేవిందంగా గుమ్మడివల్లి ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న యువకులు ఉత్సాహంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కి జై జై నినాదాలతో అభిమానం చాటుకున్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా గుమ్మడివల్లి గ్రామాన్ని అభివృద్ది చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గుమ్మడివల్లి కాలేజ్ లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందున దుర్వాసన వస్తుందినీ తెలుపడం వెంటనే స్పందించి ఐటిడిఏ డిఈ తో మాట్లాడి అంచనా వేసీ ఇవ్వాలని ఆదేశించారు. ఐటిడిఎ పిఓ తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. నెమలిపేట గ్రామం లో జరుగుతున్న బొడిక మంగరాజు (జాన్ రాజు) రాములమ్మ (రాహెల్) దంపతుల కుమార్తె ప్రశాంతి వివాహ వేడుకలో పాల్గొనీ వారిని ఆశీర్వదించారు. అదే గ్రామంలో మంచి నీటి సమస్య ఉందని మహిళలు తెలియజేయడంతో వెంటేనే ఆర్డబ్ల్యుఎస్ డిఈ తో ఫోన్ లో మాట్లాడి గ్రామాన్ని సందర్శించి సమస్య ఏంటో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రావు, సర్పంచ్ కంగాల పరమేష్, ఉప సర్పంచ్ చిన్నంశెట్టి శ్రీనివాస్, పుట్టా సత్యం, చీమిడిబోయిన వెంకటేశ్వరరావు, అమిర్, నులకానీ శ్రీను, ఆకుల శ్రీను, చందా కుమారస్వామి, చందా ముసలయ్య, కలపాలి శ్రీను, గిరి, నాగరాజు, నరేంద్ర, చందు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.