మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 23: అశ్వారావుపేట మండలంలో మంగళవారం దొంతికుంట చెరువులో మృతదేహం తేలియాడుతుండటంతో స్థానికులు పోలీస్ వారికి తెలియజేయడంతో మృతదేహాన్ని చెరువు నుంచి రెస్క్యూ టీమ్ బయటకి తీశారు. మృతుడు అశ్వారావుపేట కు చెందిన టైర్ల వ్యాపారి తనయుడు ముస్లిం బజారుకు చెందిన ఎస్కే అమిర్ (25) గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.