UPDATES  

 రైతులకు అవగాహన సదస్సు

 

మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు మండల పరిధిలోని సుద్దిమల్లలోని రైతు వేదికలో మంగళవారం ప్రధానమంత్రి కిసాన్ రెండువేల నగదు జమ పథకాన్ని మరియు ఆయిల్ ఫామ్ కల్టివేటింగ్ ప్రమోషన్ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వేపలగడ్డ తండ, బొజ్జాయిగూడెం, సుద్దిమల్ల, జగదంబాగుంపు, పాత నర్సాపురం, మోట్ల గూడెం గ్రామాల నుంచి రైతులు హాజరైయ్యారు. జూన్ నెల నుంచి ప్రతి మంగళవారం శుక్రవారాలో శుద్ధిమల్ల రైతు వేదికలో వ్యవసాయ న్యాయ సలహా కేంద్రం అగ్రీ లీగల్ ఎయిడ్ లో సతీష్ ఖండేల్వాల్ రామకృష్ణ పారా లీగల్ వాలంటర్లు రైతులకు భూమి వ్యవసాయ సంబంధిత చట్టాలు, పథకాలపై న్యాయపరమైన సలహాలు సూచనలు అందిస్తారని స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని శృతి రైతులకు తెలిపారు. రైతులకు సతీష్ ఖండేల్వాల్ ను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎల్ వి సతీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ రైతు బీమా, పంట బీమా పథకాలు ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలని హాజరైన రైతులను సతీష్ ఖండేల్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !