UPDATES  

 ఘనంగా అమ్మవారి 6 వ వసంత వేడుకలు లోక కళ్యాణార్థం చండీ హోమం -ఏరియా జిఎం దుర్గం రామచందర్

  • ఘనంగా అమ్మవారి 6 వ వసంత వేడుకలు
  • లోక కళ్యాణార్థం చండీ హోమం
  • -ఏరియా జిఎం దుర్గం రామచందర్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 23

మణుగూరు లోని కొండాపురం భూగర్భ గని ఆవరణ లో గని కార్మికుల రక్షణార్ధం,లోక కళ్యాణార్థం నిర్మించిన అమ్మవారి ఆలయం 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా గని అవరణంలో వేద పండితుల మంత్రాల నడుమ చండీ హోమం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ పాల్గోని హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.గని ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వర రావు, మేనేజర్ బీరెడ్డి.వెంకటేశ్వర్లు, రక్షణ అధికారి మధుబాబు దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఏరియా కార్మికులు వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని ప్రమాద రహిత ఏరియాగా మణుగూరు ఏరియా,నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఏరియా జిఎం దుర్గం రామ చందర్ అమ్మ వారిని ప్రార్ధించారు.ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో యస్.ఓ టు జి యం లలిత్ కుమార్,ఓ సి-2 ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మిపతి గౌడ్,ఏరియా ఇంజనీర్ నర్సిరెడ్డి,ఏరియా రక్షణ అధికారి వెంకట రమణ, గని వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్, గుర్తింపు కార్మిక సంఘ నాయకులు వూకంటి.ప్రభాకర రావు,నాగెల్లి,అధికారులు,టెంపుల్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !