- డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
- -బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి రామిరెడ్డి
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 23
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ పరిధి లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు కిడ్నీ బాధిత రోగుల కోసం సుమారు 50 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు అన్ని అనుబంధసంఘాలనాయకులు,కార్యకర్తలు,సకాలంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, ప్రధాన కార్యదర్శి రామిడి. రామిరెడ్డి కోరారు