మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 23: పంచాయతి కార్యదర్శులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలోనే రెగ్యులైజేషన్ చేస్తానని ప్రకటించిన సందర్బంగా మండల పంచాయతి కార్యదర్శులు అందరూ మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెగ్యులైజేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, పీఎండీఓ శ్రీనివాస రావు, ఎంపీఓ సీతా రామరాజు, సూపర్ డెంట్ శ్రీనివాస రావు, యూడీసీ కూమారి, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.