మన్యం న్యూస్, పినపాక:
జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులను రెగ్యులర్ చేస్తానని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో పినపాక ఎంపీడీవో కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసిఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యం లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరికీ త్వరలో రెగ్యులర్ జీవో వస్తుందని తమకు నమ్మకం ఉన్నదని కేసీఆర్ అందరికి న్యాయం చేస్తారని తెలియజేసారు.ఇంకా పల్లెలలో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేస్తామని తెలియజేసారు. క్రమబద్ధీకరణ చేస్తున్న కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గొగ్గెల నాగేశ్వరరావు,పంచాయతి కార్యదర్శులు జైపాల్ రెడ్డి,హుస్సేన్ ,అనిల్, అజహార్, అశోక్ ,సాయి, సాంబ, ఆదినారాయణ,కృష్ణమూర్తి,రాజు ,జ్యోతి, అరుణశ్రీ ,సావిత్రి, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు