UPDATES  

 ఇంటిగ్రేడెడ్ వెజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

ఇంటిగ్రేడెడ్ వెజ్,నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్ ;మే 24

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రాజీవ్ గాంధీ నగర్ ఏరియాలో సుమారు 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న ఇంటిగ్రేడేట్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. పనులు వివరాలను సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి,ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అందుబాటు లోకి తీసుకురావాలని వారు సూచించారు.ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు మాట్లాడుతూ,దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్ని రకాల వసతులతో సువిశాలమైన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నామని వారు తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.ప్రజల సౌకర్యార్థం అన్ని షాపులు ఒకే దగ్గర ఉండేలా సమీకృత మార్కెట్ నిర్మించడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని,తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అన్నారు. వేగంగా పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పోశం. నర్సింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు,ఎండిఓ రాజమౌళి,ఎంపీఓ వెంకటేశ్వర్లు
ఏఈలు నాగేశ్వరరావు,సత్య, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శి నవీన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ వట్టం రాంబాబు,యాదగిరి గౌడ్, యూసఫ్,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !