మన్యం న్యూస్ దుమ్మగూడెం మే 24::
ఇంటర్మీడియట్ సెకండియర్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన దుమ్ముగూడెం గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థి కొండ సాయి తేజను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ బుధవారం తన కార్యాలయంలో పిలిపించి అభినందనలు తెలిపి మేమెంటు అందించారు. సెకండ్ ఇయర్ విభాగంలో 990/1000 మార్కులు సాధించిన సాయి తేజ. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా గవర్నమెంట్ కళాశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు అలానే కళాశాల అధ్యాపకులను అనుదీప్ అభినందించారు ఈ కార్యక్రమంలో డిఐఈఓ సులోచన రాణి కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ వెంకటేశ్వర్లు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.