UPDATES  

 పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం…

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం…

డయాలసిస్ కేంద్రం పేదలకు ఒక వరం

మణుగూరులో వంద పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన
రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు,భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్…

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 24

పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు తెలిపారు. బుధవారం మండలం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయం తో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రిని పరిశీలించి ఆసుపత్రి యొక్క సమస్యలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, మణుగూరు వంద పడకల ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసుకున్న డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా నియోజకవర్గం లోని ఏడు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.కిడ్నీ సమస్యలు ఉన్న రోగులకు డయాలసిస్ బాగా ఉపయోగపడుతుందన్నారు. డయాలసిస్ అనేది ఖర్చుతో కూడుకున్న వైద్యం అని, సామాన్య ప్రజలకు వైద్యం భారం కాకూడదు అనే ఉద్దేశం తోనే ఉచిత డయాలసిస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చామని వారు తెలిపారు.ప్రజలందరూ డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కిడ్నీ రోగం వస్తే ప్రాణాలు పోయే అంత పని అవ్వడమే కాకుండా,అనేక ఇబ్బందులు ఎదుర్కొని హైదరాబాద్, ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్,చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది అని,కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా నిమ్స్ వంటి మూడు ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాసిస్ సేవలను ఏకంగా 102 కు పెంచి సేవలు విస్తృతం చేశారు అన్నారు.మరికొన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో వైద్య రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.రాష్ట్రంలోని 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.57 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందిస్తున్నామన్నారు కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు విప్ రేగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసీ పోశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, జిల్లా వైద్య అధికారి డీసీహెచ్ఎస్ రవిబాబు,ఎండిఓ రాజమౌళి,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, స్థానిక సర్పంచ్ బచ్చల భారతి, మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు కార్యదర్శి రామిరెడ్డి,నవీన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !