ఉత్తమ ప్రతిభకు పురస్కారం
ఎస్పీ వినీత్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న గుండాల సీఐ, ఎస్ఐ
మన్యం న్యూస్ గుండాల: ఉత్తమ ప్రతిభకు పురస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని గుండాల సిఐ ఎల్. రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ అందుకున్నారు. బుధవారం కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా ప్రజలతో మమేకమై ఎలా పనిచేయాలో అనే దానిపై అవగాహన కార్యక్రమాన్ని వారికి నిర్వహించారు. ఏదైనా సమస్య ఉన్న నేరం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న వెంటనే 100 తో పాటు స్థానిక సీఐ, ఎస్సై కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచించింది. ఏటీఎం పిన్ నెంబర్లు, నెట్ బ్యాంకింగ్ నెంబర్లను మార్చుకోవాలని వారు సూచించారు. బాల్య వివాహాలు నేరం కనుక 18 సంవత్సరాలకు కింద ఉన్న వారికి పెళ్లి చేస్తే తక్షణమే పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసక్క కాకుండా ఉండాలని వారు అన్నారు
