మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నుంచి మణుగూరు సింగరేణి ఏరియాకు బదిలీపై వచ్చిన సింగరేణి ఉద్యోగి పద్ధం. శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందజేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, యువజన నాయకులు రవి ప్రసాద్,హర్ష నాయుడు, సృజన్,సురేందర్ పటేల్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.