యువత లక్ష్య సాధనకై ముందుకు సాగాలి.. డాక్టర్ వెంకట్రావు.
ఏజెన్సీలోని క్రీడాకారులను ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడ పోటీలు ఎంతో దోహదపడతాయి.. మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.
దబ్బనూతల క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ గా కొత్తపల్లి జట్టు..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 24::
యువత వారి లక్ష్యం కోసం ముందుకు సాగాలని భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.దుమ్ముగూడెం మండలం దబ్బనౌతుల గ్రామంలో గత 20 రోజులుగా కొనసాగుతున్నటువంటి క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు బహుమతి ప్రధానోత్స సభకు తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల్లో విజేతగా కొత్తపల్లి జట్టు, రన్నర్స్ గా దబ్బునొత్తుల జట్టు నిలిచాయి. మొదటి బహుమతిగా గెలిచినటువంటి కొత్తపల్లి జట్టుకు 25000/- సీల్డ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు రెండో బహుమతిగా నిలిచినటువంటి డబ్బునూతుల జట్టుకు 15000 రూపాయలు భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్ల వెంకటరావు అందించారు మూడో బహుమతిగా కొత్తమారేడుబాక జట్టుకు 5000/-, నాలుగో బహుమతిగా దుమ్ముగూడెం జాంటీ లెవెన్ జట్టుకు 3016/- బహుమతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని క్రీడాకారులు యువత క్రీడా పోటీల్లో పాల్గొని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని ఆశించారు. మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులో ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. యువత క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించి సాగాలని ఆకర్షించారు పొంగులేటి శీనన్న ఆధ్వర్యంలో యువతకు తమ వంతు సహాయకరులు అందిస్తూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ స్థానిక సర్పంచ్ సోంది నాగమణి ఎండి నవాబ్, వీఆర్వో వెంకటేష్ నిర్వాహ కమిటీ సభ్యులు తోట రమేష్ సోంది రమేష్, రాము సిద్దు గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.