మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామపంచాయతీ పరిధిలో బైపాస్ నందు నూతనంగా నిర్మించిన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఎవరనేది గుర్తించాల్సి ఉందని మృతుడికి సుమారు 40 సంవత్సరముల వయసు ఉండవచ్చని, మృతుడు సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు , చామనఛాయ రంగు ,గడ్డంతో ఉన్నాడని, మృతుడి ఒంటిపై లేత ఆకుపచ్చ రంగు చొక్కా మరియు ఖాకీ ప్యాంటు ఉన్నాయి పోలీసులు తెలిపారు. బాబు క్యాంప్ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల లోని మార్చు రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సుమన్ కు 87126820 నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.