UPDATES  

 రూ.25 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వం నిధులు మంజూరు

  • రూ.25 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వం నిధులు మంజూరు
  • మణుగూరు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా
  • మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
  • -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 25

మణుగూరు పట్టణంలోని శివలింగాపురం ఏరియా నందు గల నాయుడు కుంట మినీ ట్యాంక్ బండ్ ను సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు,సెంట్రల్ లైటింగ్ తో పాటు ఇతర సుందరీకరణ అభివృద్ధి పనులు ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సంబంధిత మున్సిపల్ అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,25 కోట్ల రూపాయలతో మణుగూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు విప్ రేగా తెలిపారు.మినీ ట్యాంక్ బండ్ కట్టపై రోడ్డును పటిష్టం చేయడంతో పాటు సిసి రోడ్డు నిర్మాణం,సెంట్రల్ లైటింగ్ మొక్కలు పెంచి గ్రీనరీగా తయారు చేయడం జరుగుతుంది అన్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్లే రహదారినీ విస్తరించి,వెడల్పు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అన్నారు. ఎమ్మార్వో కార్యాలయం పక్కన 5 కోట్ల 50 లక్షలతో మున్సిపాలిటీ నూతన భవనం నిర్మిస్తున్నట్లు విప్ రేగా తెలిపారు.పనులు ప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.20 వార్డులోని వార్డుకు కోటి రూపాయలు చొప్పున సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం తో పాటు ఇతర మౌలిక వసతులకు నిధులు కేటాయించడం జరిగింది అన్నారు.సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో మణుగూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా జిల్లా లోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని విప్ రేగా తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చేయటం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు అన్నారు.పట్టణంలో సుంద్రీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్,మణుగూరుకు నలుమూలల డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను చేపడుతున్నామని తెలిపారు. వీధులలో ప్రత్యేక ఆకర్షణగా సెంటర్ లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తీర్చడంతో సహా పట్టణ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు,ఏఈ నాగేశ్వరరావు,ప్రజాప్రతినిధులు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అప్పారావు కార్యదర్శి నవీన్,సీనియర్ నాయకులు ఎడ్ల.శ్రీను, యూసఫ్,లక్ష్మయ్య,రమణ,రమేష్,యువజన నాయకులు సాగర్ యాదవ్,హర్ష నాయుడు,గుర్రం సృజన్, రవిప్రసాద్,రాజు తదతరులు పాల్గోన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !