- సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- ఏర్పాట్లను పరిశీలించిన జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 25
మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సంబంధిత అధికారులతో కలిసి పివి కాలనీ భద్రాద్రి స్టేడియం లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికతో పాటు,తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంగణాన్ని,ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ప్రాంతాన్ని, హనుమాస్ టెంపల్ వద్ద గల అమర వీరుల స్థూపం వద్ద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ భద్రాద్రి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చేస్తున్న ఆయా విభాగాల అధికారులతో మాట్లాడుతూ,జూన్ 2వ తేదీన జరుగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీ యెత్తున సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు,స్థానిక పురజనులు అధిక సంఖ్యలో రావటం ఆనవాయితీగా కొనసాగుతుంది అన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలుగకుండా తగినన్ని కుర్చీలు వెయ్యడం,మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చెయ్యడం, ప్రాధాన వేదికను కళాత్మకంగా సుందరికరించడం,గ్రౌండ్ మొదలు సరిపడా లైటింగ్ ఏర్పాటు చెయ్యడంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అధిక సంఖ్యలో విచ్చేసే మహిళల రక్షణ నిమిత్తం సరిపడ సెక్యూరిటీని ఏర్పాట్లు చేయడంతో పాటు,వేడుకలు ఆసాంతం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కు ఇతర ప్రాంతాల నుండి వచ్చే కళాకారులు,స్థానిక సింగరేణి ఉద్యోగ కళాకారులు అందరినీ అలరించేలా చక్కని సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాట్లు చేయలన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసే వివిధ రకాల స్టాల్స్ పెట్టుకునే వ్యాపారస్తులు రుచి సూచికరమైన పదార్ధాలు అందించడంతో పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించేలా నిబంధనలు విధించాలని అధికారులకు సూచించడం జరిగింది. సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయవలసినదిగా జనరల్ మేనేజర్ దుర్గం
రామచందర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏజిఎం సివిల్ వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్,వి.రామేశ్వర రావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎండి షబీరుద్దీన్,ఈఈ ఎలెక్ట్రికల్ శోబన్,ఈఈ సివిల్ ప్రవీణ్ కుమార్,టిబిజికేఎస్ యూనియన్ నాయకులు వీరభద్రయ్య,కాపా శివాజీ తదితరులు పాల్గొన్నారు.