UPDATES  

 మణుగూరు పట్టణ అభివృద్దే లక్ష్యం మణుగూరు పట్టణంలో విప్ రేగా విస్తృత పర్యటన

  • మణుగూరు పట్టణ అభివృద్దే లక్ష్యం
  • మణుగూరు పట్టణంలో విప్ రేగా విస్తృత పర్యటన
  • పలు అభివృద్ధి పనుల పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టోన్:మే 25

మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాలని వారు తెలిపారు.అనంతరం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న నూతన డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను విప్ రేగా అధికారులతో కలిసి పరిశీలించారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.సుందరయ్య నగర్,మేదర బస్తి,ఏరియాలలో బస్తి దవాఖాన ఏర్పాటు కోసం విప్ రేగా కాంతారావు అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి పరిశీలించారు. తాత్కాలిక భవనం ఏర్పాటు కోసం అద్దె భవనాన్ని కూడా వారు పరిశీలించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ,పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బస్తి దవాఖాన,పల్లె దవాఖాన ల,ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో దవాఖాన లు ఏర్పాటు జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.పేదల వద్దకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో పల్లె దవాఖానాలు,పట్టణ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.మణుగూరు పట్టణ అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లాలోనే మణుగూరు పట్టణాన్ని మొదటి స్థానంలో నిలబెడతామన్నారు.ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్,గ్రంథాలయం, మణుగూరు ప్రాంతానికి నలుమూలల డబల్ రోడ్డు తో పాటు,సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి అన్నారు. త్వరలోనే వాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు,రామిరెడ్డి,నవీన్ పార్టీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి. సంజీవరెడ్డి,యాదగిరి గౌడ్ యూసఫ్,యువజన నాయకులు,రవి ప్రసాద్, సృజన్,సురేందర్ పటేల్,పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !