మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం విత్తన డీలర్ల సమావేశం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు.ఈ సమావేశానికి ఏటూరు నాగారం ఉప వ్యవసాయ సంచాలకులు శ్రీధర్ హాజరై మాట్లాడుతూ.విత్తన డీలర్లు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా క్రయ విక్రయాలు జరపాలని, సరైన లేబులింగ్ లేని గుడ్డ సంచులలో అమ్మే విత్తనాలను 100శాతం సీల్ లేకపోతే నకిలీ విత్తనంగా పరిగణిస్తారని అటువంటివి ఎవరైనా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సమావేశానికి హాజరైన స్థానిక ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.నిబంధనలకు లోబడి వ్యాపారం చేసుకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో వేణుగోపాల్,ఏఈఓ లు రాజు, ఈశ్వర్,డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
