- మహిళాభివృద్ది బీఎస్పీతోనే సాధ్యం.
- బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షురాలిగా కేతిని కుమారి నియామకం
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
- మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ప్రతీ ఎన్నికల్లో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారని,మహిళాభివృద్ధి బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.గురువారం స్థానిక ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ హాల్ లో జరిగిన బీఎస్పీ మహిళా విభాగం కార్యకర్తల సమావేశానికి కామేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఎస్పి పార్టీ అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలిగా కేతిని కుమారిని నియమించారు.ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందంజలో ఉన్నారని అన్నారు.మహిళా శక్తిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి చూడొద్దని తెలిపారు.మద్యపాన ఉద్యమంలో మహిళలు చేసిన పోరాటం తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేశారు.రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలుపు కోసం ప్రతి మహిళ ఒక వీర సైనికురాలిగా పనిచేయాలని అన్నారు మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చడం పెద్ద పని కాదని ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అని అన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి,కోలా మల్లికా,నాగుల రవికుమార్, మాలోత్ వీరు నాయక్, కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,ఎర్రంశెట్టి రాజేశ్వరి,మాలోత్ భానుమతి,గుంజ సరోజ తదితరులు పాల్గొన్నారు.